ప్రకాశం జిల్లాలో 425.2 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లాలో 38 మండలాలకు గాను 29 మండలాలలో 425.2 మి.మీల వర్షపాతం జిల్లా సరాసరి 11.2 మి.మీ ల వర్షపాతం నమోదు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాస రావు తెలిపారు. అందులో అత్యధికంగా శింగర రాయ కొండలో 70.2 మి.మీలు, అత్యల్పంగా త్రిపురాంతకంలో 0.6 మి.మీలు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన మండలాలు జరుగుమల్లి 50.6 మి.మీలు, చీమకుర్తి 33.4, సంతనూతల పాడు 32.6, పొన్నలూరు
29.6, కొండేపి 26.4. ఒంగోలు 19.2, పామూరు 18.0, దర్శి 16.8, కురిచేడు 16.4, ముండ్లమూరు 15.8, టంగుటూరు 11.4, పీసీ పల్లి 10.0, తాళ్లూరు 9.4, పొదిలి 6.6, కొత్త పట్నం 6.4, మర్రి పూడి 6.2, యర్రగొండ పాలెం 6.0, కొనకల మిట్ట, కనిగిరిలలో 5.8, మార్కాపురం.6, హెచ్ ఎం పాడు 5.0, దొనకొండ 4.2, గిద్దలూరు 2.6. దోర్నాల, పెద్దారవీడు, సీ ఎస్ పురం 2.4 చొప్పున, వెలిగండ్ల 2.0, మద్ది పాడు 1.4 మి.మీల చొప్పున నమోదు అయినది. రబీ లో పొగాకు, ఇతర పంటల ముమ్మర సాగులో ఉన్న సమయంలో కురుస్తున్న వర్షాల వలన సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన పంటలలో వర్షపు నీటికి బయటకు పంపి, సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జెడీఏ శ్రీనివాసరావు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *