మొక్కలను నాటి వాటి పరిరక్షణ కోసం కృషి చేసినట్లయితే అవి జీవకోటికి ప్రాణవాయువును అందించడమే కాకుండా మనుషులను కూడా రక్షిస్తాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఏ.కే.యూ ప్రాంగణం లోని యూనివర్శిటీ కళాశాల సమీపంలో ఆయన స్వయంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ విద్యాలయాలలో మొక్కలను పెంచడం ద్వారా గ్రీనరి అభివృద్ది చెందుతుందని ఇటీవల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన పిలుపు మేరకు నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు గ్రీనరి అభివృద్ది కోసం ఏ.కే.యూ ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు తదితరుల సంపూర్ణ సహకారంతో మొక్కల పెంపకం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన విలేఖరులకు తెలిపారు. ఇటీవల కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో మొక్కలు పెంపకానికి భూమి బాగా అనువుగా ఉందన్నారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేందుకు పలు రకాల మొక్కలను ఆయన స్థానిక ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. దీనితో ఆయన ఏ.కే.యూ కళాశాలకు ప్రక్కనే ఉన్న ఉద్యాన వనంలో విద్యార్థులు అందుబాటులో లేని సమయంలో వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుని యూనివర్శిటీ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకొని డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనకు పలువురు సిబ్బంది సహకరించారు.ఈ సందర్భంగా డాక్టర్ మండే.హర్ష ప్రీతం దేవ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో గతంలో వర్షాలకు ముందు పలు కార్యక్రమాల ద్వారా మొక్కలను నాటడం జరిగిందనీ, ఇటీవల కాలంలో రెండు వారాల పాటు వర్షాలు కురవడంతో గతంలో నాటిని మొక్కలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమం లాగా చేపట్టి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణాన్ని ఒక ఉద్యాన వనం లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంతో పాటు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు తదితరులకు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
