విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయి – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – బదిలీపై వెళ్తున్న ఏఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్ కి ఘనమైన ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఎఆర్ విభాగంలో విశిష్ట సేవలు అందించి సాధారణ బదిలీలులో భాగంగా తిరుపతికి బదిలీ అవుతున్న ఏఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్ కి పోలీస్ కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీసు అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. డిఎస్పీ గారికి జిల్లా ఎస్పీ శాలువ కప్పి సన్మానంచి జ్ఞాపకలు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ….జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఎస్పీ పరిపాలన అంశాలపై అన్ని విధాలుగా నాకు సహాయ సహకారాలు అందించారన్నారు. ఎలక్షన్ సమయంలో, బందోబస్తు, నేర నియంత్రణలో డి.ఎస్.పి గా అందించిన సేవలు అభినందనీయమని, విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పని చేశారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. బదిలీపై వెళ్లిన జిల్లాలో కూడా మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని, వృత్తిజీవితంలో మరిన్ని పదోన్నతులు, పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్,ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఒంగోలు టు టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఎఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *