సంఘ ఐక్యతతో మరింత ముందుకు సాగి పోవాలని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ నూక సాని బాలాజీ అన్నారు. నాగంబొట్ల పాలెం యాదవ సంఘ బంధువుల ఆధ్వర్యంలో కొత్త పట్నంలో ఆదివారం కార్తీక మాస వన భోజన మహోత్సవం నిర్వహించారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎపీటిడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ జంగా క్రిష్ణ మూర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సంఘంలో విద్యా వంతులను ప్రొత్సహించి మరింత ఉన్నతంగా ఎదగడానికి కృషి చెయ్యాలని కోరారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాగంబొట్ల పాలెం నాయకులు పిన్నిక రమేష్, సూరిబాబు (పెద్దన్న)లను అభినందించారు. వివిధ రంగాలలో స్థిర పడిన యాదవ సంఘ ప్రముఖలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు .
