ప్రజానాట్యమండలి కళాకారులు, సంచలన సినీ దర్శకులు టి కృష్ణ 38వ వర్ధంతి ఏపీ ప్రజానాట్యమండలి, కృష్ణ మెమోరియల్ స్కూల్, కృష్ణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మల్లయ్య లింగయ్య భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కృష్ణ కల్చరల్ సొసైటీ సభ్యులు వి సింగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ( అన్న) హాజరై మాట్లాడుతూ …….కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని, ప్రజా చైతన్యం కోసం అని నమ్మిన సిద్ధాంతంతో టి కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు చిత్రాలు ఆరు ఆణిముత్యాలు అన్నారు. మోస పద్ధతిలో ఉన్న సినీ రంగంలో మాదాల రంగారావు, టి కృష్ణలు పెను సంచలనాలను సృష్టించాలన్నారు. పెను మార్పులు తెచ్చారన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తాంతంగా సినిమాలు చేశారన్నారు. అందువల్లే వారు సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచారన్నారు
. విజయవాడలో కమ్యూనిస్టు పార్టీకి, అక్కడి గూండాలకు మధ్య నడిచిన ఇతివృత్తాంతంతో నిర్మించిన చిత్రమే ప్రతిఘటన అన్నారు. ఈ సినిమా హైదరాబాదులో ఒక థియేటర్లో ఏడాది పాటలు నడిచి సంచలనం సృష్టించింది అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మించిన చిత్రం రేపటి పౌరులు అన్నారు. ప్రజలు వ్యాప్తి చేయాల్సింది టీ కృష్ణ, మాదాల రంగారావు లలోని భావాలని అని పిలుపునిచ్చారు. టి కృష్ణ తనయుడు సినీ హీరో గోపీచంద్ విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉన్న కారణంగా ఈ ఏడాది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించలేకపోతున్నామని తెలిపారు. డాక్టర్ నాగపోయిన ఆదినారాయణ మాట్లాడుతూ …… వెండితెరపై మాదాల రంగారావు, టి కృష్ణలు వామపక్ష భావాలను చూపి గొప్ప విజయాలు సాధించారన్నారు. వారిద్దరూ ప్రకాశం జిల్లా వారు కావటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రముఖ కవి పొన్నూది వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ ……. కళామతల్లి కి కడుపు కోత మిగిల్చిన వ్యక్తి టి కృష్ణ అన్నారు. దేవాలయం లాంటి సినిమాలు టీ కృష్ణ వంటి దర్శికులు తీస్తారు అని ఎవరు ఊహించి ఉండడన్నారు. టి కృష్ణ తన చిత్రాలలో మహిళా సమస్యలకు పెద్దపీట వేస్తారన్నారు. డాక్టర్ నూనె అంకమ్మరావు మాట్లాడుతూ ……. సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న అంశాలపై సినిమాలతో టి కృష్ణ తన బాణాలను ఎక్కుపెట్టారన్నారు. ఆయన బతికి ఉంటే నేటి యువత పెడమార్గం పెట్టకుండా అనేక చిత్రాలు తీసేవారు ఉన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ…… సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు టీ కృష్ణ సినిమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. మాదాల రంగారావు, టి కృష్ణలు లేని లోటు సినీ రంగానికి, నాటక రంగానికి తీరనిది అన్నారు. మెడిసిన్ల మల్లికార్జున మాట్లాడుతూ ……..లెనినిజం, మార్క్కిమ్ సిద్ధాంతాలను వంట పట్టించుకున్న టి కృష్ణ ప్రజా సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని సినిమాలు తీసి విజయం సాధించారన్నారు. ముందుగా టి కృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సభ అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల పోటీలను విజేతలకు బహుమతులు చేశారు. కార్యక్రమంలో ఇంకా చిడిపోతూ వెంకటేశ్వర్లు, డాక్టర్ సంత వేలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

