అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొన్ని దివ్యాంగ విద్యార్దులను ప్రోత్సహించేలా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు.
ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒంగోలులోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్దులకు నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ bతమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని దివ్యాంగ విద్యార్ధులను ప్రోత్సహించుటకు 10 క్రీడా అంశాల్లో సోమవారం దివ్యాంగ విద్యార్థులకు క్రీడలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది దివ్యాంగ విద్యార్దులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనుచున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి అర్చన, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి అంజల, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల, ఉమా మనో వికాస కేంద్రం. ఎస్.ఆర్.కె చెవిటి మూగ పిల్లల పాఠశాల తదితర పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.



