రెవెన్యూ సమస్యల పరిష్కారమే ప్రభు
త్వ లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని తాళ్లూరు మండలప్రత్యేకాధికారి మాధురి అన్నారు. తాళ్లూరు మండలంలో విఠలాపురం, కొర్రపాటివారిపాలెం
గ్రామాల్లో గ్రామసర్పంచ్ లు మారం ఇంద్రసేనారెడ్డి, కొర్రపాటి శ్రీదేవి అధ్యక్షతనశనివారం రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుల నుద్ధేశించి ప్రభుత్వం ప్రజలచెంతకే రెవెన్యూ యంత్రాంగంను తీసుక వచ్చి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు. తమతండ్రి కొనుగోలు చేసిన భూమిని దాదాపు 40ఏళ్లుగాసాగు చేసుకుంటుండగా బాకీ పేరుతో ఓవ్యక్తి అక్రమంగా ఆభూమి కొంత భాగాన్నికుటుంబీకులకు తెలియకుండా ఆన్లైన్ చేసుకొని రిజిష్టర్ చేయించుకుని ఇబ్బందులు పెడుతున్నారని విఠలాపురం ఎస్సీ కాలనీకి చెందిన పాలెపోగు నాగేశ్వర రావు,గురువయ్య కుటుంబీకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. గ్రామం లోని ఒకరి వద్ద డికె పట్టా కొనుగోలు చేసి 30 ఏళ్లుగా అనుభవంలో వుండి సాగు చేస్తున్నా సాగులో వున్న భూమిని ఆన్లైన్ చేయక ఇబ్బందులు పెడుతున్నారని, తమ భూమికి ఆన్లైన్ చేయాలని తాటికొండ శ్రీనివాసరావు అధికారులకు అర్జీ అందజేశారు. తాళ్లూరు నుండి కొర్రపాటివారిపాలెం వెళ్లే మార్గంలో తమ పూర్వీకులు నివాసముంటుండగా గ్రామ ఎస్సీ కాలనీ చెందిన వ్యక్తి తమ స్థలంలో కొంత విస్తీర్ణా న్ని ఆక్రమించున్నాడని, ఆక్రమణలు తొలగించాలని అనేక మార్లు అధికారులకున్ని ఆక్రమించున్నాడని, ఆక్రమణలు తొలగించాలని అనేక మార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, తమ స్థలాన్ని ఆక్రమణ నుండి తొలగించాలని, పేద లమైన ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయాలని తాళ్లూరు పాముల కాలనీ వాసులు అధికారులకు ధరఖాస్తు అందజేశారు. రెవెన్యూ సంబంధ సమస్యల కోసం విఠలాపురంలో 17, కొర్రపాటివారిపాలెంలో 17 దరఖాస్తులు అందజేశారు. ఈ సద స్సుల్లో తహసీల్దార్ కె.సంజీవరావు, డిప్యూలీతహసీల్దార్, మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదావు సర్వేయర్-శ్రీనివాసరావు, ఆర్ఎ అనూష, విఆర్వో సుశీల రాణి, రమణారెడ్డి, పలు గ్రామాల విఆర్వోలు, రైతాంగం పాల్గొన్నారు.

