హైదరాబాద్ ఏప్రిల్ 16
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో న్యూరో సర్జరీ లో కోబోటిక్ మైక్రో స్కోప్ ప్రారంభం అయింది.ఇది చిన్న ,సున్నిత ప్రాంతాల్లో కూడా రోబోటిక్ ఆర్మ్ సమర్థవంతంగా పని చేస్తుందనీ కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఎండీ ,చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ ,చైర్మన్ సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ.వి.గురవారెడ్డి తెలియ జేశారు. గురువారం బేగంపేట లోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సాంకేతికతను ప్రవేశ పెట్టడం ద్వారా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించాలనే తన నిబద్ధతను మరో సారి నిరూపించుకుంది. పాయింట్ లాక్ పొజిషన్ మెమరీ వంటి ఫీచర్లు సున్నితమైన శస్త్ర చికిత్స ప్రాంతాలపై స్థిరమైన ఫోకస్ ను కొనసాగించడంలో సహాయ పడతాయి. దీర్ఘ కాలిక శస్త్ర చికిత్సల సమయంలో వైద్యుల అలసటను తగ్గిస్తుంది.ముఖ్యంగా వాస్క్యులర్ న్యూరో సర్జరీ లో ఉపయోగకరం ట్యూమర్ ఫ్లోరోసెన్స్,ట్యూమర్ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మెదడు కణజాలం నుంచి వేరు చేయడంలో సహాయ పడుతుంది.ఈ సమావేశంలో డా.సి.హెచ్ గోపాల్,డా.మోహన్ శేషాంక్ దీవి,డా.వినోద్ కుమార్,డా.నివేదితా సాయి చంద్ర పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.



