గర్భిణీ సమయంలో పౌష్టికాహారం సంవృద్ధిగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డతో పాటు, తల్లికూడా ఆరోగ్యంగా వుంటుందని అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత అన్నారు. దర్శి ప్రాజెక్ట్ పరిధిలోని రమణాలవారిపాలెంఅంగన్వాడీ కేంద్రం లో గర్భిణీలు, బాలింతలకు, మూడేళ్ల లోపు పిల్లల తల్లులకు పౌష్టికాహారంపై అవగా హన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల లోపు పిల్లలకు జింక్ ఫుడ్ సంబందించిన తినుబండారాలు తినిపించ వద్ద న్నారు. ఆపదార్ధాలకు తినటం వల్ల పిల్లలకు వచ్చే ఆరోగ్యసమస్యలను వివరించారు. తల్లులు తమ ఇంటి పెరటులో మంచి ఆకుకూరలు , ఇంట్లో తయారు చేసే ఆహార పదార్ధాలను అందిస్తే పిల్లలు ఆరోగ్య వంతులుగా వుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పుష్పలత, పద్మజ, సుమలత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
