ప్రకాశం నగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మోహిత్ బీసా నియామకం

బేగంపేట ఏప్రిల్ 16
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన ప్రకాశం నగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మోహిత్ బీసా నియమితులయ్యారు.
ఎస్‌సి మాలా సామాజిక వర్గానికి చెందిన మోహిత్ 2008 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. గతంలో బేగంపేట్ డివిజన్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషి చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ నాయకత్వంలో పనిచేస్తూ, యువతను ఆకర్షించడం మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ నియామకాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మరియు మేడ్చల్-మల్కాజిగిరి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్ లు ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మోహిత్ బీసా నాయకత్వంలో ప్రకాశం నగర్ డివిజన్‌లో యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రకాశం నగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన మోహిత్ ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం అభినందించారు.పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *