ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి అవటంపై ఆయన అభిమానులు, టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, దేవస్థాన చైర్మన్ కొసనా గురు బ్రహ్మం , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, పార్లమెంటు కార్యదర్శి మేడగం వెంకటేశ్వర రెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (చందన), ఉప సర్పచి కాశి రెడ్డి, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర), ప్రసన్న కుమార్, శనివారపు కోటి రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి ప్రకాశ రావు ప్రత్యేక పూజలు చేసి మాగుంటకు దీవేనలు అందించారు.


