ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్రపంచ కప్ సాధించడం లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ లు ప్రపంచ కప్ విజేత శివారెడ్డి ని ఘనంగా సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు సీదా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
