సమయ పాలన పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉప విద్యాశాఖాధికారి చంద్ర మౌళీశ్వర్ అన్నారు. తాళ్లూరులో కస్తూరిబా పాఠశాల, నాగంబొట్ల పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈఓ చంద్ర మౌళీశ్వర పరిశీలించారు. కస్తూరి భా పాఠశాలలో సీఆర్టీ లు హాజరు సక్రమంగా నమోదు కాక పోవటంపై డిప్యూటీ డీఈఓ వివరణ అడిగారు. సక్రమంగా ఫెసియల్ నమోదు కావటం లేదని చెప్పారు. రాగి జావలో పురుగులు, ఆహారంలో బల్లి పడిన విషయాన్ని విద్యార్థులు డిప్యూటీ డీఈఓ దృష్టికి తెచ్చారు. బాత్ రూం లను పరిశీలించారు, మరుగుదొడ్లు మరింత శుభ్రంగా ఉంచాలని సూచించారు. మోను పరిశీలించి తగిన సూచనలు చేసారు. కస్తూరిభాలో ఆరోగ్య కార్యకర్త ఫిర్యాదు మేరకు, నాగంబొట్ల పాలెంలో కుకింగ్ ఎజెన్సీ మార్పు విషయంమై విచారణ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, సుధాకర రావు, కస్తూరిబా ప్రిన్సిపాల్ సుజిత, నాగంబొట్ల పాలెం హెచ్ఎం అంజలి, సిబ్బంది పాల్గొన్నారు.
