ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బి జే పి శ్రేణులు సంబురాలు నిర్వహించారు.ఈ సంభరాలలో సీనియర్ బి జే పి నాయకులు నెమలి ఆనంద్ (నందు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహంకాళి జిల్లా నూతన అధ్యక్షుడు భరత్ గౌడ్ ని కలిసిన నెమలి ఆనంద్ శాలువ బొకే అందించి సన్మానించి అభినందలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ్ గౌడ్, మైసూర్ మధుసూధన్, మెంగని సతీష్, టి శ్రవణ్, దయానంద్, సురేష్, శ్రీకాంత్, రవి, వినోద్ యాదవ్, నాగరాజ్,అరవింద్ సింగ్, సత్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


