పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం – తూర్పు గంగవరం పీహెచ్ సి డాక్టర్ కావలి మౌనిక

వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరకుండా చేయవచ్చని తూర్పు గంగవరం పీహెచ్ సి డాక్టర్ కావలి మౌనిక అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిహెచ్ సి పరిధిలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలలో 19 సంవత్సరాల లోపు విద్యార్థులందరికి డీవార్మింగ్ మాత్రలు మింగించినట్లు మౌనిక తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ పీహెచ్సీ పరిధిలో మొత్తం విద్యార్ధులు 5503 మంది ఉండగా 5393 మంది విద్యార్థులతో మాత్రలు మింగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన విద్యార్థులకు మరలా పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యంగా విద్యార్థులు భోజనం చేసే సమయంలో చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెప్పారు. గోళ్లు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి , హెచ్ జి ఓ చంద్రశేఖర్ బాబు, పిహెచ్ఎన్ రవణమ్మ , హెచ్.వి సుశీల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *