ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు.నకిలీ స్టిక్కర్లు వేసుకునితిరిగే వాహనాలు సీజ్ బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య………….

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించనున్నట్లు బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య వాహనదారులను హెచ్చరించారు .ఇటీవల బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ ఫిల్మ్ తో రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి బ్లాక్ ఫిల్ములను తొలగించమన్నారు. అలాగే త్రిబుల్ రైడింగ్ ,రాంగ్ సైడ్ డ్రైవింగ్, చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.సిగ్నల్ జంపింగ్ చేసే వారిని గుర్తించేందుకు ముఖ్యమైన కూడళ్ళలో సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ప్రెస్, పోలీస్, ఎమ్మెల్యే ఇలా కొందరు కార్లకు, బైకులకు నకిలీ స్టిక్కర్లు వేసుకొని ప్రయాణిస్తున్నారని మరికొందరు కార్లకు సైరన్ పెట్టుకొని ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై నిఘా పెట్టా మని వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. కూడళ్ళలో సిగ్నల్ జంపింగ్ చేస్తున్న వాహనాలను ఆపిన సమయంలో కొందరు ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై తనిఖీలు కొనసాగుతాయనీ అన్నారు. అలాగే నో ఎంట్రీ సమయంలో బస్సులు, లారీలు ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఆపరేషన్ రోప్ కొనసాగుతుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *