మస్తాన్ వలి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు మరియ ప్రపంచ సంస్కృతి మరియు పర్యావరణ పరిరక్షణ కమిషన్ జాతీయ సభ్యుడిగా పదవీ

ఇండియా లోనే మొట్ట మొదటి సారి ఏంతో ఉన్నతమైన ఆలోచనతో స్థాపించిన దక్కన్ క్లాప్ ఇండియాస్ ఫస్ట్ పెయింటింగ్ కమ్ వాటర్‌ ఫ్రూఫింగ్ సర్వీస్ ఏంతో మంది ప్రజలకు మేలు చేస్తుంది అని, ఇంత మంచి ఆలోచనతో సర్వీస్ ఇవ్వటం దేశానికి గర్వకరణం అని మస్తాన్ వలి లాంటి వారు ఈ దేశ యువతకు స్పూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ
కొనియాడారు . నిజమైన నాయకత్వ పటిమతో దేశ అభివృద్దికి ఉపయోగ పడే ఉన్నతమైనా ఆలోచనతో సర్వీస్ ఇస్తున్నారు…..ఇలాగే మరిన్ని ఉన్నతమైన మరియు గొప్ప ఆలోచనలతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని హృదయపూర్వకంగా అభినందించారు.
అయితే మస్తాన్ వలి స్థాపించిన దక్కన్ క్లాప్ సంస్థ భారతదేశంలోనే టాప్ 100 MSME కంపెనీలలో ఒక కంపెనీగా అవార్డు దక్కించుకుంది, ఈ పోటీలో 27,467 కంపెనీలు నామినేషన్లు వెయ్యగా, డీప్ వెరిఫికేషన్ తరువాత ఇండియా SME బోర్డు డెక్కన్ క్లాప్ ను టాప్ 100 కంపెనీలలో ఒకటిగా ఫైనల్ విజేత గా ప్రకటించింది. వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమీషన్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ క్యాటగరీ లో గౌరమైన డాక్టరేట్ పట్టాను మరియు నేషనల్ మెంబర్ ఆఫ్ వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమీషన్ పదవీని అందుకోనన్నారు. పేద కుటుంబంలో పుట్టి ప్రకాశం జుల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరం నుండి వెళ్లి, కష్టపడి, పట్టుదలతో పనిచేసి దేశ ప్రదాని మనుసు గెలుచుకున్న మస్తాన్ వలి కి గ్రామ పెద్దలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేతలు, కుటుంబ సబ్యులు అభినందనలు తెలిపారు. తమ ప్రాంత వాసి కి ప్రత్యేక గుర్తింపు దక్కటంపై ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *