చాట్ జీపీటీ, ఏఐ అంశాల‌పై అవ‌గాహన సద‌స్సు

ఒంగోలులోని క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో చాట్ జీపీటీ, ఏఐ అంశాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ అంశంలో నిష్ణాణుతులైన చ‌క్కా బాల ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం చాట్ జీపీటీ, ఏఐ టెక్నాల‌జీలు ప్ర‌పంచాన్ని శాసిస్తున్నాయ‌ని, దాంట్లో ఉండే అవ‌కాశాల‌ను గురించి వివ‌రించారు. విద్యార్థులు ఆయా టెక్నాల‌జీల‌ను అర్థం చేసుకుని, వాటిలో నైపుణ్యం సంపాదించుకుంటే భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క్విస్ విద్యా సంస్థ‌ల అధినేత డాక్ట‌ర్ సూర్య క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ.. …ప్ర‌స్తుతం ఏఐ టెక్నాల‌జీలో అద్భుత‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. క్విస్ విద్యార్థుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న టెక్నాలజీని ప‌రిచ‌యం చేస్తూనే ఉంటామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ వై.వి. హ‌నుమంత‌రావు బాలా గారిని ప్ర‌శంసించి, ఆయ‌న‌కు స‌న్మానం చేశారు. కార్య‌క్ర‌మాన్ని సీఎస్ ఈ హెచ్ ఓడీ బుజ్జిబాబు, ఏఐఎమ్ ఎల్ హెచ్ ఓడీ డాక్ట‌ర్ జి.ఎల్. వి ప్ర‌సాద్ ప‌ర్య‌వేక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ హెచ్ ఓడీ డాక్ట‌ర్ టి. సునిత‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *