ప్రజా భవన్ ఆవరణలో స్టేట్ గెస్ట్ హౌజ్ ను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి…………

బేగంపేటలోని ప్రజా భవన్ ఆవరణలో స్టేట్ గెస్ట్ హౌస్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు.అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రులు పరిశీలించారు.
అనంతరం మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం క్యాంపు ఆఫీసుగా వినియోగించిన భవనాన్ని ఆధునీకరించి స్టేట్ గెస్ట్ హౌస్ గా మార్చడం జరిగిందన్నారు.స్టేట్ గెస్ట్ హౌస్ ను అన్ని వసతులతో ఇంటిని మరిపించాలే తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే అతిధులకు, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఈ స్టేట్ గెస్ట్ హౌస్ ని వినియోగంలోకి తేవడం జరిగిందన్నారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా స్టేట్ గెస్ట్ హౌస్ ను సకల సౌకర్యాలతో ఫైవ్ స్టార్ హోటల్ ను మరిపించేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.వేరే రాష్ట్రాల నుంచి వచ్చే అతిథిల కోసం హోటళ్లలో గదులు కేటాయించి ప్రజాధనం వృధా చేయకుండా స్టేట్ గెస్ట్ హౌస్ ను వినియోగిస్తామన్నారు.గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఫైవ్ స్టార్ హోటల్స్ లో స్టే లు ఇచ్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు.ఇవ్వాల మేం ఎలాంటి ఖర్చులు లేకుండా సకల సౌకర్యాలతో కూడిన స్టేట్ గెస్ట్ ను వినియోగంలోకి తెచ్చామన్నారు.మాకు ఆడంబారాల కన్నా అవసరాలు తీరడం ముఖ్యం, ప్రజాధనాన్ని ఒక్క రూపాయి వృధాగా పోనివ్వమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులు బండి సంజయ్ కామెంట్స్ పై స్పందించాలని అడగగా కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆబ్ కి బార్ 400 నినాదం ఇచ్చి 240 సీట్లుకే పరిమితమైనప్పుడు ఏం చేశారు.నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో లక్షల రూపాయల డబ్బులు వేస్తామని మర్చిపోయిండ్రునీ అన్నారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని కానీ, వాస్తవంలో దేశంలో నిరుద్యోగతి పెరిగిందని.. దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని నిలదీశారు.ఇప్పటికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో బండి సంజయ్ తెలపాలని మంత్రి ప్రశ్నించారు.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 కీ పైగా ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఓట్ల తేడాతో 3 సీట్లు ఓడింది, లేకపోతే మాకు 12 సీట్లు వచ్చేవన్నారు. స్టేట్ గెస్ట్ హౌజ్ భవన ప్రారంభోత్సవంలో
చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఆర్ &బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఆర్ & బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *