బేగంపేట మార్చి 6 (జే ఎస్ డీ ఎం)
బేగంపేట్ డివిజన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ గురు మూర్తి లైన్ లో నూతన
సీవరేజ్ పైప్ లైన్ పనులను గురువారం కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో డివిజన్ పరిధిలోని గురుమూర్తి లైన్
లో పాత సీవరాజ్ పైప్ లైన్
తో తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో నూతన సీవరాజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యతతో పనులు చేపట్టాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. అలాగే డివిజన్ పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రాజయ్య, అరిఫ్, గురుమూర్తి లేన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

