నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునః పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
అమరావతి నుంచి సి సి ఎల్ ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ… నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాల్లో జరుగుచున్న రీ సర్వే ప్రక్రియ నిర్దేశించిన గడువులోపు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ సదస్సులో నమోదైన అర్జీలన్నింటిని సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలన్నీ పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల అమలుపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చుపాలన్నారు. రీ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


