2029లో జగనే ముఖ్యమంత్రి : వైసిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

2029లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి అవుతారని వైసిపి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎంఎల్ఎ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరుణాల సందర్భంగా వైసిపి అభిమానులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014, 2024లో కూటమితో జతకట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టారని అన్నారు. కానీ తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని, అబద్ధాలు చెప్పలేకనే అధికారం కోల్పోయామని అన్నారు. వాళ్ళు చెప్పిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున ప్లెక్సీలతో నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా పాట కచేరి అందర్నీ అలరించింది. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, వైసిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *