పొదుపు సంఘాలు నమన్వయంతో పనిచేసి ప్రకృతి సాగు మరింత పెంచాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో బాగంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. ఐదు సెంట్ల నుండి తనకు చేయగలిగినంత పొలంలో ప్రకృతి సాగు చేపట్టవచ్చని చెప్పారు. నిరంతరం పంటలు, ఉత్పాదకత, చేయూత మార్కేటింగ్ గురించి వివరించారు. కార్యక్రమంలో వెలుగు ఎపీఎం పి దేవ రాజ్, సీసీ లు మోహన్, నుచంద్ర ప్రకృతి సాగు టీఏ ప్రభాకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


