రంజాను పండుగను సోమవారం ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు.ముస్లీం సోదరులు పాల్గొని భక్తి శ్రర్థలతో నవాజ్‌లు నిర్వహించారు.
తూర్పుగంగవరం, రామభద్రాపురం, శివరామపురం, మల్కాపురం, బొద్దికూరపాడు, గంగపాలెంలలో ముస్లీం సోదరులు ప్రత్యేక నవాజ్‌లు నిర్వహించారు. ఒకరికి మరోకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తూర్పుగంగవరంలో వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఈద్గా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. ముస్లీం సోదరులు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీష్(బుజ్జి), మల్కాపురం సర్పంచి షేక్ వలి, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లాలు ముస్లీం సోదరులకు రంజాన్ శుంభాకాంక్షలు తెలిపారు.

