ఎస్పీ రోడ్ హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు……

బేగంపేట ఏప్రిల్ 12(జె ఎస్ డి ఎం న్యూస్) :
హనుమత్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎస్పి రోడ్డు శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాలైన పూలమాలలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. శనివారం
శ్రీ వీర హనుమాన్ ను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, అర్చకులు సి. బద్రీనాథ్ ఆచార్యుల పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ ను దర్శించుకునేందుకు శనివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *