తాళ్లూరు మండలంలోని విఠలాపురంలో రూ. 2కోట్ల
రూపాయల వెచ్చించి నిర్మించిన రామాలయంను ఈనెల 13వ తేదీ ప్రతిష్టించ నున్నారు. విఠలాపురం కాలనీ ఏర్పాటు సమయంలో నాలుగు అడుగుల ఎత్తులో గుడి నిర్మించి రాములవారి శిలను ఏర్పాటు చేసి పూలు చేస్తున్నారు. వివాహాల సమ యంలో దేవునికి ఎదురు నడిస్తూ ఆలయం వద్ద పూజలు చేయటం, శ్రీరామనవమి వేడుకలు జరపటం ఆనవాయితీ. ఆచిన్న విగ్రహాం స్థానే రామాలయం నిర్మించాలని తలంచి ఐదేళ్ల క్రితం భూమి పూజ చేశారు. ప్రభుత్వ సహకారంతో సీఎస్ఎఫ్ కింద రూ.16లక్షలు మంజూరుకాగా గ్రామస్తులు, దాతల సహకారంతో రూ.50 లక్షలు సమకూర్చి రామాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఆలయనిర్మాణ నిర్వహకులు వివిధ ప్రాంతాల్లో వున్న ఆలయాలను పరిశీలించి అత్యంత వైభోవేపేతంగా వుండే ఆలయనిర్మాణంకు శ్రీకారం చుట్టారు. ఆలయ గర్భగుడి, శిఖరం వరకు రాతి కట్టడం తో నిర్మించారు. ఆలయ ప్రహరీగోడ చుట్టూ రామాయణ కథ భక్తులకు అర్ధమయ్యే రీతిగా రాములవారి జీవిత విశేషాలు తెలిసే రీతిగా పలుచిత్రాలను చిత్రీకరించారు. అన్ని హంగులతో ఆలయనిర్మాణం చేపట్టి దాతలు, ప్రభుత్వ సహకారంతో రూ.50లక్షలు సమకాగా మిగిలిన కోటిన్నర రూపాయలను గ్రామవాసి మారం సుబ్బరాయుడు కుమారుడు యుఎస్ఏలో వ్యాపార దిగ్గజం మారం అంజిరెడ్డి తానే స్వయంగా సమకూర్చాడు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావటంతో ఆదివారం ఆలయప్రతిష్ట దేవతా మూర్తుల విగ్రహ, కలిశ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాటు చేపట్టారు.

