ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలలో వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 94శాతం మంది, ప్రధమ సంవత్సరంలో 60 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ద్వితీయ సంవత్సరంలో ఈఈటీ కి చెందిన ఎ భాగ్య లక్ష్మి (966), సీఈసీ కి చెందిన జీ లీకన్య (846) మార్కులు సాధించారు. ప్రధమ సంవత్సరంలో ఈఈటీ కి చెందిన షేక్ సహానా (462), సీఈసీ కి చెందిన జి అఖిల (452) సాధించి ప్రతిభచాటారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.


