తెలంగాణా రాష్ట్రంలో రాహుల్ ,ప్రియాంక గాంధీసేన బలోపేతం ……..వివిధ వర్గాల మద్దతు……ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం….రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్.

బేగంపేట ఏప్రిల్ 13(జే ఎస్ డి ఎం న్యూస్):
తెలంగాణా రాష్ట్రంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) ను మరింత బలోపేతం చేస్తున్నామని,వివిధ వర్గాల మద్దతు పలుకు తున్నాయని రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్ అన్నారు.బేగంపేట లోని కార్యాలయంలో ఆయన్ను కలిసిన వివిధ వర్గాల వారు తమ మద్దతు తెలియ జేశారు. రాహుల్ ప్రియాంక గాంధీ సేన కార్యక్రమాలను తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మరింత దగ్గరగా చేర్చడానికి భవిష్యత్ కార్యాచరణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సేన పాత్ర, సేవా కార్యక్రమాల నిర్వహణ,సేన విస్తరణ, బలోపేతంపై చర్చించి సమాలోచనలు జరిపారు. తెలంగాణా రాష్ట్ర స్మాల్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. రమెష్, తెలంగాణా జర్నలిస్ట్ జే. ఏ. సి రాష్ట్ర అధ్యక్షుడు ఏం. నరహరి , ఓయూ విద్యార్థి జె.ఏ. సి అధ్యక్షుడు సి.హెచ్ రాకేష్ లు ఫయాజ్ తో సమావేశమై చర్చించారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం లోని వివిధ జిల్లాల్లో కమిటీలు నియామకం పూర్తి చేశామన్నారు గ్రేటర్ కమిటీలు కూడా వేశామన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రం లోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *