గుంటి గంగాభవాని తిరునాళ్లు- 14న తిరునాళ్ల భక్తుల కోర్కేలు తీర్చే కల్పవల్లి……. గంగమ్మతల్లి.. ముస్తాబైయిన ఆలయం- ఏర్పాట్లు పూర్తి……

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన గుంటిగంగా భవాని ఆలయం 100వ వార్షికోత్సవ తిరునాళ్లకు ముస్తాబైంది. గంగా భవాని తిరునాళ్లను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. తాళ్లూరుమండలంలోని తూర్పుగంగవరం పంచాయితీ పరిధిలో ఈ ఆలయం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గంగమ్మతల్లిని కోలుస్తారు. ప్రతి ఏడాది చైత్రమాసం బహుళ విధియనాడు వైభవంగా తిరునాళ్లను నిర్వహిస్తారు. కొండకోనల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతకు ఆలవాలం….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఇదీ స్థలపురాణం……

గంగా భవాని ఆలయం 12వ శతాబ్దం నాటిదని, కాటంరాజు కాలంలో నిర్మించిన గంగమ్మదేవాలయాలలో ఇది ఒకటని స్థానికులు చెబుతున్నారు. ఈ గుడికి దక్షణం వైపు కొండపాదు వద్ద ఉన్న పెద్దరాతి గుండు క్రిందగా నీరు ప్రవహిస్తుండటం వల్ల దీనిని గుండుగంగగా పిలిచేవారు. ఏడాది పోడవునా ప్రవహించే జల ఆధారంగా
చుట్టు ప్రక్కలగ్రామాల రైతులు పంటలు పండించేవారు. ఈజల గంగమ్మతల్లి వరప్రసాదముగా భావించి ఎటా తిరునాళ్లు జరపటం అనవాయితీగా వస్తుంది.

జలధారపైన ఉన్న గుండును తొలిగిసై ఇంకా పెద్దదవుతుందని భావించిన రైతులు దానిని ప్రక్కకు తొలగించారు. దీంతో అక్కడ గుంత ఏర్పడినది కాని నీరు మాత్రము పెరగలేదు. అప్పటినుండి గుంటగంగాగా పిలుస్తూ కాలక్రమంలో గుంటిగంగా గా మార్పుజరిగినది. దీన్ని దక్షణ కాశీగా కూడ పిలుస్తారు.

పూర్వం మునులు తపస్సు చేసుకొంటూ గుంటిగంగలో స్నానమాచరించి శివాలయంలో పూజలు చేసేవారని చెబుతారు. ఈప్రాంతంలో ఎప్పుడూ మునులు జపిస్తున్న మంత్రాలు వినిపిస్తుండేవని, అందువల్ల ఈ ప్రాంతాన్ని స్వాములవారి ధ్వనీ అనిపిలిచేవారని పెద్దలు చెబుతుంటారు. దశాబ్దం క్రింతం గంగమ్మ, శివాలయంలను పునరుద్ధరించారు. ఈ ప్రాంతంలోనే క్రిష్ణాలయం, కాశీనాయన ఆశ్రమం, నాగదేవత పుట్ట ఉన్నాయి.

పూర్వం ఈ ఆలయం కొండకోనల మధ్యఅడవిలో ఉండటంతో తిరునాళ్లను పగలు చేసేవారు. క్రమేపి అడవి అంతరించి పోవటంతో రాత్రివేళల్లో చేస్తున్నారు.

ఈతిరునాళ్లను తిలకించేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు. తిరునాళ్ల సమయంలోనే కాకుండా శుక్ర, ఆదివారాలలో భక్తులు వందలసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి పొంగళ్లు, నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఇక్కడ వివిధ పలు ఆలయాలు, కులాల సత్రాలు ఉన్నాయి. శ్రీశైలం తర్వాత అన్ని వర్గాలకు చెందిన కులసత్రాలు అధికంగా ఉన్నది ఇక్కడే. ఈసత్రాల వద్ద తిరునాళ్లరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. మూడు గ్రామాలలో గ్రామోత్సవం ..
శనివారం మూడు గ్రామాలలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం 13న నిలువు, గ్రామోత్సవం, 14న అమ్మవారి తిరునాళ్ల నిర్వహిస్తారు.గుంటిగంగాభవానీ తిరునాళ్లకు విద్యుత్ ప్రభలను పలు రాజకీయ పార్టీల మద్దతు దారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే విద్యుత్ ప్రభలు పూర్తిగా తగ్గిపోయాయి. 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో ఒక విద్యుత్ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ ఒకటి , టిడిపి ఆధ్వర్యంలో మరో మూడు, జన సేన ఒకటి విద్యుత్ ప్రభలను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో బందో బస్తు…
గుంటిగంగాభవానీ తిరునాళ్లకు దర్శి డిఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 30 మంది ఎస్సెలు, మూడు ప్రత్యేక పార్టీలతో తో దాదాపు 600మంది బారీ బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు దర్శి సిఐ రామారావు తెలిపారు. తూర్పుగంగవరం, తాళ్లూరులలో ట్రాఫికైపై కూడ ప్రత్యేక శ్రధ్ద వహిస్తున్నట్లు ఎస్సె మల్లిఖార్జున రావు వివరించారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *