తాళ్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన చిరు జల్లులు పడటంతో వాతావరణం చల్ల బడినది. మధ్యాహ్నం నుండి బాగా ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్ల బడటంతో వృద్ధులు, పిల్లలు ఊపిరి పీల్చుకున్నారు. ఇతర ప్రాంతాలలో భారీ వర్షం పడుతున్నా సరే ఈ ప్రాంతంలో గత రెండు రోజుల నుండి ఊరించి ఉసూరు మని పిస్తుంది. అయితే మొక్కజొన్నతో పాటు పలు పంటలో కోత దశలో ఉండటంతో అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
