భూ సమస్యల పరిష్కారానికి తగిన కృషి చెయ్యాలని తహసీల్దార్ సంజీవరావు కోరారు. బెల్లంకొండ వారి పాలెం, విఠలాపురం గ్రామాలలో రీసర్వే సందర్భంగా వచ్చిన పలు సమస్యలపై విఅర్ ఓ లతో, రెవిన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. రీ సర్వే డిటీ ప్రశాంత్, మండల సర్వేయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
