మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉపాధి కూలీలు మెరుగ్గా పాల్గొనేలా చూడాలని ఎంపీడీఓ దార హనుమంత రావు కోరారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో శనివారం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పశువుల తొట్లు 16 గాను 14 పూర్తి అయినట్లు మిగిలినవి కూడ త్వరగా పూర్తి చెయ్యాలని కోరారు. ఎపీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
