కాశ్మీర్ ఉగ్రవాద దాడికి నిరసనగా శనివారం ఒంగోలు జర్నలిస్టులు స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుండి సెర్చ్ సెంటర్ వర్క్ కోవొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాం పర్యటకులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. భారతదేశంలో శాంతిని కాంక్షిస్తుందని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందుకు తగ్గ విధంగా బదిలిస్తుందని వారన్నారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా అమాయకులైన పర్యాటకులను చంపడం మానవత్వానికి తీరని మచ్చని వారు పేర్కొన్నారు. ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయానికైనా జర్నలిస్టుల పూర్తి మద్దతు ఉంటుందని వారన్నారు. దాడి చేసిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
టెర్రరిస్టు దాడిలో చనిపోయిన మృతులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య ఐ జె యు సభ్యులు కే శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు భాష ,కార్యవర్గ సభ్యులు విజయ్, ఆంధ్రప్రభ బ్యూరో ఇంచార్జ్ భాస్కర్ రెడ్డి, రాజా, విశాలాంధ్ర స్టాప్ రిపోర్టర్ నాగేశ్వరరావు, గంగా న్యూస్ ఎడిటర్ లింగరాజు , పేన్ పవర్ స్టాప్ రిపోర్టర్ హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

