అమరావతి పునర్నిర్మాణ సభకు తాళ్లూరు మండలం నుండి అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చెరుకుని పొదుపు సంఘాల మహిళలతో కలిసి బస్సులు, కార్ల లో బయలు దేరి వెళ్లారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి జెండా ఊపి బస్సులను, వాహనాలను పంపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, పార్టీలో పలు హోదాల్లో ఉన్న నాయకులు శాగం కొండా రెడ్డి, మానం రమేష్, షేక్ పెద కాలేషా వలి (బడే), గొల్లపూడి వేణుబాబు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యాసాగర్, తూము శివ నాగి రెడ్డి, సుసుం ఆదినారాయణ రెడ్డి, పాలెం అంజి రెడ్డి, నాగేశ్వర రావు, చాట్ల డాని, రామయ్య, లక్ష్మి నారాయణ, నాదేళ్ల శ్రీను, హనుమంత రావు, బ్రహ్మయ్య, ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత, పొదుపు సంఘ మహిళలు పాల్గొన్నారు. తహసీల్దార్ సంజీవ రావు, ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎపీఎం దేవరాజ్ లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
