హైదరాబాద్, మే 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
బంగారు లావాదేవీలలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతికతతోనే ఇది సాధ్యమవుతుంది. దీనికి గోల్డ్‌సిక్కా 2022లోనే నాంది పలికింది. తాజాగా మరింత ఆధునికతతో ప్రజలలోకి వెళ్లేందుకు భారతదేశంలో మొదటి ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ను బేగంపేటలో త్వరలో ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా గోల్డ్‌సిక్కా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఏస్ వై తరుజ్ మాట్లాడుతూ ఈ ఏటీఎం ద్వారా బంగారాన్ని కొనడం, అమ్మడం, మార్చడం, లీజుకు ఇవ్వడం, డిజిటైజ్ చేయడం చేయవచ్చన్నారు. బంగారు రుణాలు మినహా అన్ని సేవలు ఇది అందిస్తుందని చెప్పారు. ఇందులో మనం ఆభరణాలు కూడాకొనుగోలుచేయవచ్చన్నారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ టెలర్ మెషిన్ అన్నారు. ఎలాంటి మానవ జోక్యం ఉండదన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం ఇదన్నారు. ఈ అత్యాధునిక యంత్రం బంగారానికి సంబంధించిన అనేక సేవలు సమగ్రంగా అందిస్తుందన్నారు. భారతదేశంలో మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎం 2022లో ప్రవేశపెట్టామని, ఈ విజయంతో తదుపరి తరం ఏటీఎం మరింత ఆధునికతతో ముందడుగు వేశామన్నారు. ప్రత్యేకంగా ఈ ఏటీఎంలో అగ్యుమెంటెడ్ రియాల్టీ (ఏఆర్) అనుభూతి లభిస్తుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా వినియోగదారులు ఆభరణాలను వర్చువల్‌గా ధరించవచ్చని, నచ్చితే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇది ప్రపంచంలో మొదటి ‘ఆల్-ఇన్-వన్ గోల్డ్ ఏటీఎం’ అన్నారు. ప్రపంచంలో మొదటి ‘గోల్డ్ రియల్‌టైమ్ ఏటీఎం’ ఎంతో ఆదరణ పొందిందన్నారు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ ఉన్నాయన్నారు. దుబాయ్, కైరో, రష్యా, టాంజానియా వంటి దేశాలలో అందుబాటులో కలవన్నారు. ఇకపై బంగారం కేవలం ఆభరణంగా కాకుండా, అది ఒక అసెట్ గా మారుతుందన్నారు. భవిష్యత్తులో ఇది కరెన్సీగా పరిగణించే అవకాశం ఉందన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చన్నారు. వినియోగదారులు బంగారం అమ్మేటప్పుడు గోల్డ్‌ను ఈ మెషిన్‌లో డిపాజిట్ చేయాలన్నారు. అది మొదట మెల్ట్ చేసి బంగారం స్వచ్ఛతను పరిరక్షిస్తుందని చెప్పారు. అనంతరం ఆ బంగారానికి గల విలువను స్క్రీన్ పై చూపిస్తుందన్నారు. వినియోగదారులు ఆ విలువకు అంగీకారం తెలిపితే.. ఆ మొత్తాన్ని ఆయన బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నారు. పాత బంగారాన్ని కొత్త బంగారంగా మార్పిడి చేసుకునే అవకాశం కూడా కలదన్నారు. ఈ మెషిన్ ద్వారా ఈటీఎఫ్ (ఈటీఎఫ్ – ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) కొనుగోలు చేయవచ్చన్నారు. ఇందుకోసం సెబీ, ఇతర నియంత్రణ సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. ఈ మెషిన్ ద్వారా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కలదన్నారు. డిజిటల్ వాలెట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. బంగారం డిపాజిట్ చేసిన తర్వాత డబ్బు బ్యాంక్ ఖాతాలోకి రావడానికి సుమారు 30 నిమిషాలు పడుతుందన్నారు. ఈ సమయంలో డిపాజిటర్ ఫొటో తీస్తుందన్నారు. ఆధార్ కార్డు, ఐడీ ప్రూఫ్‌ను వెరిఫై చేస్తుందన్నారు. ఏమైనా మోసపూరిత కార్యకలాపాలు గమనిస్తే మెషిన్ ఆ బంగారాన్ని స్టాప్ చేస్తుందన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుందని తెలిపారు. ఈ గోల్డ్ ఏటీఎంపై ఫిజికల్ హ్యాకథాన్, సాఫ్ట్‌వేర్ హ్యాకథాన్, హార్డ్‌వేర్ హ్యాకథాన్ పూర్తయ్యాయన్నారు. ఇప్పటివరకు ఈ మెషిన్‌ను హ్యాక్ చేయగలిగిన వారు ఎవరూ లేరన్నారు. ఒక్కో మెషిన్ ఖర్చు సుమారు రూ. 40 లక్షలు అన్నారు. మన దేశంలో 14 ఏటీఎంలు, అంతర్జాతీయంగా 3 ఏటీఎంలు ఉన్నాయన్నారు. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 గోల్డ్ ఏటీఎంలు, ప్రపంచవ్యాప్తంగా 100 ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి లావాదేవీ డిజిటల్‌గా రికార్డవుతుందని తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ అందుతుందన్నారు. మధ్యవర్తులు, హిడెన్ చార్జీలు ఉండవన్నారు. ఈ ఏటీఎం 24/7 అందుబాటులో ఉంటుందన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.
చిరునామా : గోల్డ్‌సిక్కా లిమిటెడ్ 2వ అంతస్తు, అశోక రఘుపతి ఛాంబర్స్, ఇంటి నెంబర్ 1-10-60, ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ ప్రక్కన, బేగంపేట, హైదరాబాద్, తెలంగాణ 500016 ఫోన్: 040-4013 7575
ఈమెయిల్: info@goldsikka.com వెబ్‌సైట్: www.goldsikka.com
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి: 9959154371/ 9963980259


