పొగాకు రైతులలో నెలకొన్న ఆందోళనను తొలగించేలా వారి పంటను కంపెనీలు కొనుగోలు చేయాలి – రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్-పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహణ

పొగాకు రైతులలో నెలకొన్న ఆందోళనను తొలగించేలా వారి పంటను కంపెనీలు కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సాగు ఖర్చులు పెరిగినందున ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునే భాద్యత కంపెనీలు కూడా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొగాకు కొనుగోళ్ళు జరుగుతున్న తీరు, ధరలపై సోమవారం మంత్రి గొట్టిపాటి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎంపీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా, పొగాకు బోర్డ్ చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, జాయింట్ కలెక్టరు ఆర్. గోపాలకృష్ణ లు జిల్లాలోని ప్రజాప్రతినిధుల సమక్షంలో పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… ఈ సంవత్సరం పంట దిగుబడితోపాటు సాగు ఖర్చులు కూడా పెరిగాయన్నారు. అంతర్జాతీయంగాను పొగాకు ఉత్పత్తి పెరిగిందన్నారు. ఈ పరిస్థితులలో రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా కొనుగోళ్ళు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని గ్రేడ్ ల పొగాకును కొనుగోలు చేయాలని చెప్పారు. ఇకపై పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును వేలం కేంద్రాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, బోర్డ్ అధికారులు పరిశీలిస్తారన్నారు.

మంత్రి స్వామి మాట్లాడుతూ… హై గ్రేడ్ తో పాటు మీడియం, లోగ్రేడ్ పొగాకును కూడా కొనుగోలు చేయాలని చెప్పారు. సిస్ ప్రతిపాదన కూడా వద్దన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మార్క్ ఎడ్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి లేదన్నారు. బోగాకు బోర్డే పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వెల్లంపల్లితోపాటు ఒంగోలు – 1,2 కేంద్రాలలో నోబిడ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. హై గ్రేడ్ తో పాటు లోగ్రేడ్ పొగాకును కూడా కంపెనీలు కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

పొగాకు బోర్డ్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రతి ఏటా పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేలా బోర్డ్ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 167 మిలియన్ కేజీ ల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 240 మిలియన్ కేజీ ల ఉత్పత్తి వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని కొనుగోలు చేయించేలా ప్రయత్నిస్తామని ఆయన ప్రకటించారు. మన దేశంలో 80 మిలియన్ కేజీ లు, ఇతర దేశాలలో 400 మిలియన్ కేజీ లు అధిక ఉత్పత్తి రావడం వలన అంతర్జాతీయం గాను ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు మార్కెట్ పుంజుకునే అవకాసం ఉందన్నారు. రైతులెవరు ఆందోళన చెందవద్దని, చివరి ఆకుతో సహా కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.

పొగాకు బోర్డ్ ఈడి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 35 మిలియన్ కేజీ ల పొగాకును కొనుగోలు చేసినట్లు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి కిలో ధర సగటున రూ.231 ఉండగా ప్రస్తుతం రూ.262 లు ఉన్నట్లు చెప్పారు. కొనుగోలుదార్లతో తరచూ మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు దామచెర్ల జనార్ధన రావు, బి. ఎన్. విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ లోగ్రెడ్ పొగాకును కొనుగోలు చేయకపోవడం వలన రైతులు పలుమార్లు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని, దీని వలన రవాణా ఖర్చులతో పాటు కొంత పొగాకును కూడా నష్టపోవాల్సి వస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు మాట్లాడుతూ.. మార్క్ ఫెడ్ జోక్యం చేసుకుంటే బాగుంటుందని అన్నారు.

రైతులు మాట్లాడుతూ గత ఏడాది క్రమంగా ధరలు పెరిగాయని, ప్రస్తుతం దానికి భిన్నమైన పరిస్థితి నేలకొన్నదన్నారు. ఇంకా తగ్గుతాయోమోనని భయపడుతున్నట్లు చెప్పారు.

కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ మరో 20 రోజులల్లో అంతర్జాతీయంగా తమకు ఆర్డర్ లు వస్తాయని చెప్పారు. ఇప్పటికే తమ ఇండెంట్ల మేరకు కొనుగోలు చేస్తున్నామని, నెలాఖరుకు మరింతగా కొనుగోలు చేస్తామని చెప్పారు.

ఈ సమావేశం లో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, రైతు మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, దర్శి, వై.పాలెం నియోజకవర్గ ఇంచార్జ్ లు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు, డి. ఆర్. ఓ బి. చిన ఓబులేసు, సబ్ కలెక్టరు సహదిత్ వెంకట త్రివినాగ్, ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *