గుంటి గంగా భవాని లో తురకపాలెం వైసీపీ నాయకుడు, సొసైటీ మాజీ చైర్మన్ కుమ్మిత జయరామి రెడ్డి మొక్కబడి కార్యక్రమానికి అతిధులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు హాజరు అయ్యారు. కుమ్మిత జయరామి రెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. తాళ్లూరు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు టీ వీ సుబ్బా రెడ్డి, చింతా శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, మాజీ సోసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, గుంటి గంగా భవాని ఆలయ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, దర్శి వైన్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, మండల కోఆప్షన్ కరిముల్లా. గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి, మల్లేశ్వర రెడ్డి, జక్కుల రామక్రిష్ణ, నయ్యద్ లతీఫ్, బంకా నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



