తల్లిదండ్రులు వివాహాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇష్టం లేక ఇంటినుండి వెళ్లి అదృశ్యమైన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదివారం ఒంగోలు బాలల సధనంకు తరలించారు. పోలీసులకధనంప్రకారం.. కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన సంఘం అలేఖ్య కన్పించకుండా పోవటంతో కుటుంబీకులు 18 తేదీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్. మల్లిఖార్జురావు బాలిక అదృశ్యం పై మిస్సింగ్ కేసు-నమోదు చేశారు. గత వారం రోజులుగా పోలీసులువివిధ కోణాల్లో విచారణ జరుపగా అలేఖ్య సంతమాగులూరులోని తమ బంధువుల ఇళ్ల వద్ద వున్నట్లు గుర్తించి 24 వతేదీ రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుక వచ్చారు. కుటుంబ సభ్యులను ఆ బాలి క తో మాట్లాడించి సంరక్షణ నిమిత్తం ఒంగోలు బాలల సధనంకు తరలించారు. వారం రోజుల కిత్రం అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు చేదించి ఆబాలికను తీసుక వచ్చి హోమ్ కు తరలించటంతో కథసుఖాంతమయింది.
అదృశ్యబాలిక లభ్యంఒంగోలు బాలల సధనంకు తరలింపు
25
May