మానవత్వం చాటుకున్న తాళ్లూరు గ్రామ కార్యదర్శి ఇడమకంటి – పుట్టుగుడ్డి నానరమ్మకి సహాయం అందజేత

తూర్పు పాలెంకు చెందిన పుట్టుగుడ్డి, వృద్ధురాలు షేక్ నానరమ్మ (70) దీన స్థితిని గమనించి తాళ్లూరు పంచాయితీ కార్యదర్శి ఇడమకంటి వెంకట రమణా రెడ్డి చలించి పోయారు. గ్రామ దర్శన నిమిత్తం వెళ్లిన ఆయన ఆమె పరిస్థితి గమనించి తక్షణమే స్పందించి ఆయన స్వంత నిధులతో బియ్యం, ఇతర వంట సామగ్రి అందించారు. ఆమె ఉంటున్న రేకుల షేడ్ కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించి, ఇంటి ముందు వీధి కొళ్లాయి ఏర్పాటు చేసారు. పుట్టు గుడ్డి అయిన ఆమె ధైర్యంగా జీవించటం ఆదర్శమని ఆమెను సన్మానించాడు. భవిష్యత్ లో ఏదైనా అవసరం అయితే తాను నిత్యం గ్రామంలో అందుబాటులో ఉంటానని తనకు తెలియజెయ్యాలని ఆమెను కోరారు. ఇకపై ప్రతినెల నిత్యవసర వస్తువులు తన సొంత ఖర్చులతో అందజేస్తానని గ్రామ కార్యదర్శి ఆమెకు హామీ ఇచ్చారు. తమ పని తాము చూసుకుని వచ్చామా… వెళ్లామా …! అంటూ వెళ్లిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులను గమనిస్తున్న ప్రజలు ..నేను ఉన్నానంటూ పేద ప్రజలకు సహాయం చేస్తున్న గ్రామ కార్యదర్శి ఇడమకంటి వెంకట రమణా రెడ్డి దాతృత్వాన్ని సమీప ప్రజలు, గ్రామస్తులు కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *