విపత్తులను సమర్థముగా ఎదుర్కొనేలా అవసరమైన సమాచారంతో ప్రత్యేకంగా ఐ.డి.ఆర్.ఎన్ ( ఇండియన్ డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్ ) పోర్టల్ ను రూపొందించినట్లు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వెబ్సైటుకు సంబంధించి గురువారం అన్ని జిల్లాల విపత్తుల నిర్వహణ అధికారులతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించింది. ప్రకాశం భవనం నుంచి డిఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. విపత్తుల సమయంలో వివిధ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కోసం ఈ వెబ్ సైట్ ను రూపొందించినట్లు కేంద్ర అధికారులు తెలిపారు. విపత్తుల నిర్వహణ విధులతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు తమ వద్ద ఉన్న పరికరాలు, మానవ వనరుల వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరచాలని వారు సూచించారు.
సమగ్ర వివరాలతోఐ.డి.ఆర్.ఎన్పోర్టల్
19
Jun