అంతర్జాతీయ యోగ కార్యక్రమం విజయవంతగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలి – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగ కార్యక్రమం విజయవంతగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, డిఆర్ఓ చిన ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవి, కిరణ్ కుమార్, డిఆర్డీఏ, మెప్మా పిడి లు నారాయణ, శ్రీహరి, బీసీ కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, పశు సంవర్థక శాఖ జేడి రవి కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, ఆయుష్ అధికారులు డా.భీమ్ నాథ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులతో మాట్లాడుతూ… ఈ నెల 21న జిల్లాలో జరిగే అంతర్జాతీయ యోగ కార్యక్రమంనకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టడంతో పాటు నిర్దేశించిన విధంగా యోగ ప్రదేశాల రిజిస్ట్రేషన్ మరియు ఇంచార్జీల మ్యాపింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *