అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు.
గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మినీ స్టేడియం ను సందర్శించి ఈ నెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు 5 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు యోగ కార్యక్రమానికి హాజరగుచున్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమం ఏర్పాట్లను మరియు ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి , రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనుచున్నారని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు ఈ యోగ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. మన జిల్లాలో 11 లక్షల మంది ప్రజలు రిజిస్ట్రేషన్ అయివున్నారని, 6458 ప్రదేశాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా, డిఆర్డిఎ పిడి లు శ్రీహరి, నారాయణ, పశు సంవర్థక శాఖ జేడి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *