తెలంగాణ వైద్య రంగంలో డా.నాగేశ్వర్ రెడ్డి సేవలు అద్భుతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన వంతుగా ఆయనకు భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం చేస్తానన్నారు. నాగేశ్వర రెడ్డి తన వైద్య సేవలు హైదరాబాద్, తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ప్రభుత్వ విజన్లో భాగమైన హెల్త్ టూరిజంకు సంబంధించిన ప్రణాళికల్లో సేవలు తెలంగాణ కు అందించాలని నాగేశ్వర్ రెడ్డిని కోరారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు.
