ఆచార్య ఎన్ జి రంగా పౌండేషన్ ఆధ్వర్యంలో 30 కుర్చీలు బహుకరణ జూనోసిన్ దినోత్సవం సందర్భంగా జిల్లా బహుళార్ధక పశువైద్యశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య ఎన్. జి రంగా పౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యశాల కు రూ. 22 వేల విలువైన 30 కుర్చీలు అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మేజర్ గంగాడ నుజాత, జిల్లా పశువైద్యాధికారి రవి కుమార్, డిడి శ్రీనివాస రావు, ఏన్. జి రంగా పౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు నాదేండ్ల చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షుడు నామినేని మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, నభ్యులు మండవ శ్రీనివాస రావు, మోపర్తి సాంబశివ రావు, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
