తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి పండుగను మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తొలి ఏకాదశి కావటంలో ఆలయాలను భక్తులు సందర్శించి తమ ఇష్టదైవంకు పూజలలో నిమగ్నమైనారు. బొద్దికూరపాడులోని శ్రీ గంగా పర్వతి వర్దిని సోమేశ్వర స్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి దేవాలయం, గుంటిగంగా భవాని అమ్మవారి ఆలయం, శివాలయం, మాధవరం నీల కంఠేశ్వర స్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయంలో, కొత్త పాలెం పోలేరమ్మ, సాయి బాబ ఆలయం, తాళ్లూరు శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, లక్కవరం క్రిష్ణ స్వామి ఆశ్రయం లతో పాలు పలు దేవాలయాలలో భక్తులు ఆధిక సంఖ్యలో సందర్శించారు. ఆలయ పూజారురు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.



