జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి – హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడిన వ్యక్తి శ్యాంప్రసాద్ -ఇంచార్జీ తీగల సత్యవతి

ఒకే దేశం, ఒకే ప్రధాని అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ స్థాపకులు, పూర్వ జనసంఘ్ నాయకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ  జయంతి  ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా  ఇంచార్జీ  తీగల సత్యవతి
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యవతి
మట్లాడుతూ… హిందూ ధర్మం కోసం రాజకీయ పార్టీని స్థాపించిన నాయకుడని, ముస్లిం లీగ్ జిన్నా ద్విజాతి చర్యలను బాహాటంగా వ్యతిరేకించారని, క్యాబినెట్లో మంత్రి గా పనిచేస్తూ కూడా దేశ విభజనను వ్యతిరేకించారని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జన సంఘ్ ఏర్పాటు చేశారని, తరువాతి కాలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగినదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు సీట్లు గెలిచి నేడు దేశంలోనే పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగి, వరుసగా మోదీ సారధ్యంలో మూడు పర్యాయాలు అధికారం చేపట్టి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ దేశ రక్షణకు, ప్రజల సంక్షేమానికి పాటుపడుచున్నదని జిల్లా బీజేపీ నాయకులు   తీగల  కేదారనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో   మండల మహిళా నాయకరాళ్లు కుమారి, చంద్రకళ, అంజమ్మ, వెంకటరత్నం, శ్రావణి, శాంతమ్మ , తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి,సంక్షేమం మేం ఏడాదిలోనే చేశాం -ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం -అధికారంలోకి రాగానే పింఛన్ రూ.4 వేలకు పెంచాం -ఫించన్ రూ.వెయ్యి పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది -మెగా డీఎస్సీతో 13 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం -పి 4 తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి -ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన మంత్రి
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *