గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులు మరియు మాదకద్రవ్యాలను గుర్తించే పోలీస్ డాగ్ స్క్వాడ్ తో కలిసి ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళలోని బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సెంటర్లు, అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్‌ను అణువణువునా ముమ్మరంగా పరిశీలించారు. ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి భోగిలను విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిషేధిత గంజాయి లేదా మాదకద్రవ్యాలను రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ ఆర్ దామోదర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మరియు మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి, మత్త పదార్దాల నిర్మూలనకు, అక్రమరవాణాను అరికట్టే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ప్రతి కళాశాల మరియు పాఠశాలలో యువతలో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పటిష్టతే తమ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. గంజాయి మరియు మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972, స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112 కు లేదా పోలీసు వాట్సాప్ నంబరు 9121102266 కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాచారం అందించాలని కోరారు.
ఈ తనిఖీలో మహిళా పియస్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, జిఆర్ పి ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కొండయ్య, ఈగల్ టీం, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

