రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా మార్కాపురం జి.జి.హెచ్. ను అభివృద్ధి చేస్తాము – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా మార్కాపురం జి.జి.హెచ్. ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
చెప్పారు. ఈ ఆసుపత్రిలో అభివృద్ధి చేసిన ఐసీయూ, థైరాయిడ్ పరీక్ష పరికరాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిలతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక సాధించామన్నారు. ఇందులో భాగంగా మూలన పడిన ఐసీయూని పునః ప్రారంభించామని చెప్పారు. వైద్య సేవల అవసరాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా డిప్యూటేషన్ పైన వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలోని రెండో
ఆపరేషన్ థియేటరుకు వారం రోజుల్లోగా ఇన్వర్టర్
ఏర్పాటు చేసేలా, అదేవిధంగా మొదటి థియేటర్ కు బ్యాకప్ సామర్థ్యం పెంచేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు. ఆక్సిజన్ ప్లాంటు,
జనరేటర్లు కూడా మంచిగా పని చేసేలా రిపేర్లు చేయిస్తామన్నారు. విద్యుత్ వైరింగ్ సమస్యల పైనా వైద్యులతో చర్చించామని, దీనిని సరి చేసేందుకు ఇప్పటికే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు వైద్యులు చెప్పారని మంత్రి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తాను పరిశీలిస్తానన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐసీయూ ద్వారా మంచి సేవలు అందించి ఉత్తమ ఐసీయూ విభాగంగా గుర్తింపు పొందేలా పనిచేయాలని వైద్యులకు ఆయన దిశ నిర్దేశం చేశారు. ఒంగోలు వెళ్లే మార్గంలో పట్టణంలోని చెరువు కట్ట రోడ్డును కూడా మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారి వెంట సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తహసిల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతాం -రూ.500 కోట్లు ఇస్తే వెలుగొండ పూర్తవుతుందని వైసీపీ నేతలంటున్నారు -మరి ప్రాజెక్టు పూర్తి కాకుండా జగన్ జాతికి ఎలా అంకితం చేశారు ?జగన్ జిల్లా ప్రజలను మోసం చేసారని వైసీపీ నేతలు ఒప్పుకున్నట్టే కదా -వైసీపీ బతుకంతా అబద్ధాలు, మోసాలే -వెలిగొండ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం -వైసీపీ హయాంలో ప్రకాశం జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం-ఆనంద, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిప్రకాశం జిల్లా తర్లుపాడు, సీతానాగులవరం, బోడపాడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *