ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతాం -రూ.500 కోట్లు ఇస్తే వెలుగొండ పూర్తవుతుందని వైసీపీ నేతలంటున్నారు -మరి ప్రాజెక్టు పూర్తి కాకుండా జగన్ జాతికి ఎలా అంకితం చేశారు ?జగన్ జిల్లా ప్రజలను మోసం చేసారని వైసీపీ నేతలు ఒప్పుకున్నట్టే కదా -వైసీపీ బతుకంతా అబద్ధాలు, మోసాలే -వెలిగొండ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం -వైసీపీ హయాంలో ప్రకాశం జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం-ఆనంద, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామిప్రకాశం జిల్లా తర్లుపాడు, సీతానాగులవరం, బోడపాడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి తర్లుపాడు, సీతానాగులవరం, బోడపాడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన మరియు పూర్తయిన రోడ్లను ప్రారంభించారు. తర్లుపాడు ఏరియా హాస్పిటల్ లో రూ.50 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించారు. అనంతరంరైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి తీరుతాం, దీనిపై మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించి కమిటీని నియమించారు. మార్కాపురం జిల్లా చేసిన తర్వాతే ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడుగుతాం. రూ.500 కోట్లు ఇస్తే వెలుగొండ పూర్తవుతుందని వైసీపీ నేతలు గొంతులు చించుకుంటున్నారు. మరి ప్రాజెక్టు పూర్తి కాకుండా నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశారు ? అంటే జగన్ మోసం చేశారని వైసీపీ నేతలు ఒప్పుకుంటున్నట్టే కదా ? వైసీపీ బతుకంతా అబద్ధాలు, మోసాలే. వైసీపీ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెలిగొండ మేం పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. వైసీపీ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్ని హామీలు అమలు చేస్తున్నాం.ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం. ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఈ నెలలో రైతులకు అన్నధాత సుఖీభవ మొదటి విడత రూ.7 వేలు ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలో అమలు చేస్తాం. వైసీపీ లాగా మేము ప్రజలను మోసం చేయం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఆనంద ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పేదల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. గుండె జబ్బుకు సంబంధించి రూ. 40 వేలు విలువైన ఇంజక్షన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాధిస్తోందని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *