ప్లాస్టిక్ ను అంతం చేయటమే లక్ష్యంగా ప్రజలను చైతన్య వంతులను చెయ్యాలని ఎంపీడీఓ దార హనుమంత రావు కోరారు. తాళ్లూరు చెత్త సంపద కేంద్రంను శనివారం సందర్శించి చెత్త నుండి పొడి చెత్త తడి చెత్త వేరు చేయటంతో పాటు ప్రజల నుంచి చెత్తను ఎలా సేకరించాలన్న విషయమై గ్రామకార్యదర్శులకు వివరించారు.
మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర రావులు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు చిన నాటి నుండే స్వచ్ఛతపై అవగాహన కలిగించాలని కోరారు.
వెలుగు వారి పాలెంలో హెచ్ఎం పొలం రెడ్డి సుబ్బా రెడ్డి స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వాడటం వలన కలిగే అనర్ధాలను వివరించారు. కురు కురే ప్యాకేట్స్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నందున జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ప్రయోజ పూర్వకంగా ప్యాకెట్ ను కాల్చి విద్యార్థులకు అర్థం అయ్యేలా వివరించారు.


